Category: జిల్లా వార్తలు

విద్యార్థిని చంద్రకళ మృతికి న్యాయం చేయాలి – కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలి

కామారెడ్డి: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో చదువుతున్న ఎస్సీ దక్కలి సామాజిక వర్గానికి చెందిన మొదటి తరం విద్యార్థిని చంద్రకళ మృతి ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా పక్షాన డిమాండ్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట రాములు మాట్లాడారు. అట్టడుగు సామాజిక వర్గం నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి…

కల్వకుర్తిలో రూ. 25 కోట్ల రూపాయల ధాన్యం గోల్ మాల్

కల్వకుర్తి నవంబర్ 03:ప్రజా పంపిణీ వ్యవస్థకు చేరాల్సిన ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. కల్వకుర్తిలోని ఓ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా రూ.25 కోట్ల విలువైన 8,505.586 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు తేలింది. ఈ వ్యవహారంపై జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ దండు రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కల్వకుర్తి ఎస్ఐ కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని సాయిలక్ష్మి వెంకటేశ్వర పారాబాయిల్డ్ రైస్ మిల్లులో జిల్లా…

టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా నర్రా శేఖర్ రెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా గేర నరసింహ

టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా నర్రా శేఖర్ రెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా గేర నరసింహ

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) నల్లగొండ జిల్లా నూతన కమిటీని 2026-28 కాలానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కట్టంగూర్ మండల కేంద్రంలోని బీఎన్ గౌడ్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ ఏడవ జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎన్. సోమయ్య ఎన్నికల అధికారిగా, మరో రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం పరిశీలకులుగా వ్యవహరించారు.నూతన జిల్లా అధ్యక్షుడిగా నర్రా శేఖర్ రెడ్డి,…

పంట నష్టంపై పోలెపల్లిలో క్షేత్రస్థాయిలో పరిశీలన

అమనగల్ నవంబర్ 03: ప్రభుత్వం ఆమనగల్లు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించిన నేపథ్యంలో మండలంలోని 13 గ్రామ పంచాయతీల పరిధిలో వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా పోలేపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారి ప్రభావతి,సర్పంచ్ వెంకటయ్యతో కలిసి రైతుల పొలాలను సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించారు.గ్రామానికి చెందిన రైతు ఒగ్గు కృష్ణయ్య పొలంలో ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు.అలాగే పత్తి, కంది, వరి తదితర పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో…

కొట్రలో ఆరు నెలలుగా మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకేజీ

వెల్దండ నవంబర్ 03: వెల్దండ మండలంలోని కొట్ర గ్రామంలో మిషన్‌ భగీరథ తాగునీటి పైపులైన్‌ దెబ్బతినడంతో గత ఆరు నెలలుగా నీరు లీకవుతోంది. పైపులైన్‌ మరమ్మతుల కోసం సంబంధిత అధికారులకు పలుమార్లు సమాచారం అందించినట్లు గ్రామస్థులు తెలిపారు.పైపులైన్‌ నుంచి వెలువడుతున్న నీరు సమీపంలోని వరి పొలంలోకి చేరుతుండటంతో పంట సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు పేర్కొన్నారు.ఒకవైపు వేసవి, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి…

కస్తూర్బా పాఠశాలలో మురుగునీటి సమస్యకు పరిష్కార చర్యలు

వెల్దండ నవంబర్ 03 : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఆవరణలో మురుగునీరు నిల్వ ఉండటంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ మేరకు మంగళవారం గ్రామ సర్పంచ్ మట్టా యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఎంపీడీవో సులోచన, పాఠశాల ప్రిన్సిపాల్ స్రవంతి మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. పాఠశాల సమీపంలోని పంట పొలాలకు మురుగునీరు వెళ్లకుండా అడ్డుకోవడంతో సమస్య ఏర్పడినట్లు గుర్తించారు. విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని…

మైనింగ్‌ గుంతలో పడి ఇద్దరి మృతి

జ్ఞాన తెలంగాణ, వికారాబాద్‌ జిల్లా: మైనింగ్‌ గుంత ఇద్దరు మేకల కాపరుల ప్రాణాలను బలిగొంది. వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ మండలం తరిగోపుల గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ (43), అశోక్‌ (21) మేకలను మేపేందుకు వెళ్లిన...

అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ నోట్ల కలకలం

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద పోలీసులు భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను తరలిస్తున్న ముఠా నుంచి సుమారు రూ.6.7 కోట్ల విలువైన నోట్లను పట్టుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులు ఎక్కడి...

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవాలి..మట్ట మదన్ కుమార్ గౌడ్

వెల్దండ, నవంబర్ 03: అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మట్టా మదన్ కుమార్ గౌడ్ కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి పట్టభద్రుడు ఎన్నికల్లో బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మంగళవారం తహసీల్దార్ కార్తిక్ కుమార్‌ను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం బీఎల్వో ఫారమ్‌ను అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు మట్ట…