కల్వకుర్తిలో రూ. 25 కోట్ల రూపాయల ధాన్యం గోల్ మాల్
- కల్వకుర్తిలో గులాబీ జెండాకు సారథి ఎవరు?..టికెట్ రేసులో దూసుకుపోతున్న గోలి శ్రీనివాస్ రెడ్డి - November 4, 2026
- కల్వకుర్తి సహకార సంఘం నూతన చైర్మన్గా పూరం హరీశ్వర్ రెడ్డి - November 4, 2026
- పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి - November 4, 2026

కల్వకుర్తి నవంబర్ 03:ప్రజా పంపిణీ వ్యవస్థకు చేరాల్సిన ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. కల్వకుర్తిలోని ఓ రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించగా రూ.25 కోట్ల విలువైన 8,505.586 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు తేలింది. ఈ వ్యవహారంపై జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ దండు రాజేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కల్వకుర్తి ఎస్ఐ కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని సాయిలక్ష్మి వెంకటేశ్వర పారాబాయిల్డ్ రైస్ మిల్లులో జిల్లా పౌరసరఫరాల శాఖ,విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ప్రభుత్వానికి అందించాల్సిన ధాన్యంలో 8,505.586 మెట్రిక్ టన్నుల కొరత ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.25 కోట్లుగా అంచనా వేశారు.మిల్లు నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
