మైనింగ్ గుంతలో పడి ఇద్దరి మృతి
- మైనింగ్ గుంతలో పడి ఇద్దరి మృతి - November 3, 2026
- అబ్దుల్లాపూర్మెట్లో నకిలీ నోట్ల కలకలం - November 3, 2026
- ఎమ్మెల్సీ ఓటుకు 6నే ఆఖరి గడువు - November 3, 2026

జ్ఞాన తెలంగాణ, వికారాబాద్ జిల్లా: మైనింగ్ గుంత ఇద్దరు మేకల కాపరుల ప్రాణాలను బలిగొంది. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం తరిగోపుల గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ (43), అశోక్ (21) మేకలను మేపేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు మైనింగ్ గుంతలో పడిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తుల మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మైనింగ్ గుంతల వద్ద భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులు, రక్షణ ఏర్పాట్లు ఉన్నాయా? అనే అంశంపై సంబంధిత అధికారులు పరిశీలించి, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
