పంట నష్టంపై పోలెపల్లిలో క్షేత్రస్థాయిలో పరిశీలన

1001325680.jpg

అమనగల్ నవంబర్ 03: ప్రభుత్వం ఆమనగల్లు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించిన నేపథ్యంలో మండలంలోని 13 గ్రామ పంచాయతీల పరిధిలో వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా పోలేపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారి ప్రభావతి,సర్పంచ్ వెంకటయ్యతో కలిసి రైతుల పొలాలను సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించారు.గ్రామానికి చెందిన రైతు ఒగ్గు కృష్ణయ్య పొలంలో ఎండిపోయిన వరి పంటను పరిశీలించారు.అలాగే పత్తి, కంది, వరి తదితర పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు.ప్రతి రైతుకు జరిగిన పంట నష్టాన్ని నమోదు చేసి ప్రభుత్వానికి నివేదించే ప్రక్రియలో భాగంగా ఈ పరిశీలనలు కొనసాగుతున్నాయి.ఈ కార్యక్రమంలో గండికోట రవి, కొడుకుని శ్రీశైలం,నరేష్,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...