అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ నోట్ల కలకలం

జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద పోలీసులు భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను తరలిస్తున్న ముఠా నుంచి సుమారు రూ.6.7 కోట్ల విలువైన నోట్లను పట్టుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులు ఎక్కడి నుంచి నకిలీ నోట్లను తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ అక్రమ కార్యకలాపాల వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ కరెన్సీ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. దర్యాప్తు పూర్తయితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

You may also like...