Category: జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో హెచ్‌ఎం భూపతి దాస్ మృతి.. సర్పంచ్ ఘన నివాళి

వెల్దండ నవంబర్ 04 :వెల్దండ బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపతి దాస్ మంగళవారం సాయంత్రం తుక్కుగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసిన మంచి ఉపాధ్యాయుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏ. రామ్‌రెడ్డి, ఉప సర్పంచ్ బి. శ్రీను,ప్రధానోపాధ్యాయుడు రవీందర్ నాయక్, ఉపాధ్యాయులు,వార్డు సభ్యులు,విద్యార్థులు తదితరులు…

అవురుపల్లి భూముల ఆక్రమణపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు

వెల్దండ నవంబర్ 04 :మాడ్గుల మండలం అవురుపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 123లో తమకు సంబంధించిన భూములను పక్క పొలాల వారు అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు మాడ్గుల డిప్యూటీ తహసీల్దార్‌ నాయీబ్‌కు వినతిపత్రం అందజేశారు.కలకొండ రాములు, దండు పెద్ద రాములు,దార్ల లింగయ్య,ఒగ్గు జంగమ్మ, ముత్యాల నర్సమ్మ, బావండ్లపల్లి మల్లమ్మలకు చెందిన భూములను ఇతరులు సాగు చేస్తున్నారని, విచారణ జరిపి తమ భూములను తిరిగి ఇప్పించాలని…

నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్‌కర్నూల్ నవంబర్ 04: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం అందజేశారు.జిల్లాలోని బీసీ విద్యార్థులకు టీజీపీఎస్సీ గ్రూప్స్, పోలీస్, డీఎస్సీ, టెట్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కోచింగ్ కేంద్రం లేకపోవడంతో పేద విద్యార్థులు హైదరాబాద్ వంటి నగరాలకు…

బాలకృష్ణకు జిగ్రీ మిత్రుల ఘన సన్మానం

కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నికైన గంట్యాల బాలకృష్ణకు జిగ్రీ మిత్ర బృందం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా మిత్రులు పూలమాలలు, శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాల్యాల విజయ్ కుమార్, సరాఫ్ వెంకటరమణ, లక్క నరహరి, రాజు, శ్రీను, హన్మాండ్లు, వెంకన్న, శీనన్న, పద్మ శీను, వెంకా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చంద్రకళ పార్థివదేహానికి నివాళులర్పించిన డా. విశారదన్ మహారాజ్

షాద్ నగర్: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్న డక్కలి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని డాకూరి చంద్రకళ ఆత్మహత్య ఘటనపై ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డా. విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై గతంలో విశ్వవిద్యాలయ ఉపకులపతితో ఫోన్‌లో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు.మంగళవారం (నవంబర్ 3) షాద్‌నగర్‌లో చంద్రకళ పార్థివదేహానికి నివాళులర్పించిన ఆయన, బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

దోమకొండ గర్ల్స్ హైస్కూల్‌లో విద్యార్థినులకు పోలీసుల అవగాహన కార్యక్రమం

కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, దోమకొండ ఎస్సై శ్రీ ప్రభాకర్ సూచనలతో మంగళవారం దోమకొండ గర్ల్స్ హైస్కూల్‌లో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థినులకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు, వాటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాటలు, పాటల ద్వారా విద్యార్థినులకు అవగాహన కల్పించారు….

అభినవ పూలేగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్

తాడ్వాయి: ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆశయ సాధన దిశగా విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును అభినవ పూలేగా అభివర్ణిస్తూ తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ కొనియాడారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. తాడ్వాయి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో వివిధ…

ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.30 వేల పరిహారం చెల్లించాలి సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పశ్య పద్మ డిమాండ్

కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ, మాచారెడ్డి మండలాల్లో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని, నీరు లేక ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పశ్య పద్మ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.మంగళవారం పాల్వంచ, మాచారెడ్డి మండల కేంద్రాల్లో పర్యటించిన ఆమె ఎండిపోయిన పంటలను పరిశీలించి, బాధిత రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె…

AISA తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్‌గా కామారెడ్డి జిల్లా విద్యార్థి నాయకుడు జీవియం విఠల్ ఎన్నిక

కామారెడ్డి: ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) తెలంగాణ రాష్ట్రస్థాయి సమావేశంలో కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి ఉద్యమ నాయకుడు జీవియం విఠల్ రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, విద్యార్థుల హక్కుల సాధన, సామాజిక న్యాయం, అందరికీ సమాన విద్యా అవకాశాల కల్పన తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని నాయకులు…

దళిత నేతకు దక్కాలి మార్కెట్‌ పీఠం!.. మెకానిక్ బాబా- గోల్డ్ రాము

ఆమనగల్ నవంబర్ 03: ఆమనగల్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని ఈసారి దళిత సామాజిక వర్గానికి కేటాయించాలని కేఎన్‌ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్‌ బాబా, వస్పుల జంగయ్య మిత్ర మండలి అధ్యక్షుడు గోల్డ్‌ రాము ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్‌ నాయకుడు వస్పుల జంగయ్యకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.మంగళవారం వారు మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవీకాలం నవంబర్‌ 22తో ముగియనున్న నేపథ్యంలో…