టీఎస్‌యూటీఎఫ్ నల్లగొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా నర్రా శేఖర్ రెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా గేర నరసింహ
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 3: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) నల్లగొండ జిల్లా నూతన కమిటీని 2026-28 కాలానికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కట్టంగూర్ మండల కేంద్రంలోని బీఎన్ గౌడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ ఏడవ జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎన్. సోమయ్య ఎన్నికల అధికారిగా, మరో రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం పరిశీలకులుగా వ్యవహరించారు.
నూతన జిల్లా అధ్యక్షుడిగా నర్రా శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బడుగు అరుణ, వడిత్య రాజు, ప్రధాన కార్యదర్శిగా గేర నరసింహ, కోశాధికారిగా నలపరాజు వెంకన్న, కార్యదర్శులుగా మోర్తాల శ్రీనివాస్ రెడ్డి, జాల అరుణ, రాచమల్ల రమాదేవి, అడావత్ చిన్న వెంకన్న, కోట్ల యాదగిరి, గంటెల వెంకటయ్య, కోమర్రాజు సైదులు, తాటిపాముల నరసింహమూర్తి, సభావత్ భాను ప్రకాష్, గండమల్ల రామారావు, కోడిరెక్క జయరాజు, పుట్ట రాములు, జింకల సత్యనారాయణ, జి. యాదమ్మ, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా పగిళ్ల సైదులు, సభ్యులుగా పల్లా మధుసూదన్ రెడ్డి, కోదాటి మధుసూదన్, రాగి రాకేష్ కుమార్, ఎల్. హరిలతో పాటు వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్స్ పత్రిక కన్వీనర్‌గా కె. రమణ, మహిళా కమిటీ కన్వీనర్‌గా చింతమల్ల వరలక్ష్మి, అకాడమిక్ కన్వీనర్‌గా మద్దెల ప్రసాద్, సాంస్కృతిక కమిటీ కన్వీనర్‌గా గిరి యాదయ్య, క్రీడా కమిటీ కన్వీనర్‌గా బెడదూరి సురేందర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్‌గా ఎరనాగుల సైదులు, స్టడీ సర్కిల్ కన్వీనర్‌గా పి. జయసాగర్, ప్రచురణల కమిటీ కన్వీనర్‌గా పుట్టల శ్యామ్ కుమార్, ఎస్టీఎఫ్ఐ మహిళా కన్వీనర్‌గా గుండా వేదశ్రీలను నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్, రాష్ట్ర కార్యదర్శులు పెరుమాళ్ల వెంకటేశం, ఎన్. సోమయ్య నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. రాబోయే కాలంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ముందుండి పనిచేయాలని వారు సూచించారు.

