Category: జిల్లా వార్తలు

మున్సిపల్ పాలనపై సామర్థ్య శిక్షణ

పట్టణ పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) ఆధ్వర్యంలో ఒకరోజు సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఏఎస్‌సీఐ కాలేజ్ పార్క్ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలన, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య ప్రమాణాలు తదితర అంశాలపై అధికారులకు నిపుణులు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఏఎస్‌సీఐ రిజిస్ట్రార్ డాక్టర్ ఓ.పి. సింగ్,…

టిమ్స్‌ ఆసుపత్రులకు డెడ్‌లైన్‌

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల...

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉద్యోగ అవకాశం.. రోడ్డు భద్రతా సమన్వయకర్త పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.!

నెలకు రూ.40 వేల వేతనం.. దరఖాస్తుకు ఈ నెల 21 చివరి గడువునాగర్‌కర్నూల్,నవంబర్ 12: నాగర్‌కర్నూల్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తూ జిల్లా రోడ్డు భద్రతా సమన్వయకర్త పోస్టు భర్తీకి జిల్లా కలెక్టర్ కార్యాలయం దరఖాస్తులు ఆహ్వానించింది.ఈ మేరకు అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.ఈ పోస్టుకు సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. ఎంపికైన…

అవగాహనతోనే భద్రతకు తొలి అడుగు.. షీ టీమ్స్

 ఉప్పల్,  విద్యార్థినులు, మహిళల భద్రతతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని మల్కాజిగిరి పోలీసులు సూచించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉప్పల్‌లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు షీ టీమ్స్ పనితీరు, వాస్తవ ఘటనల ఆధారంగా కేస్ స్టడీలు, సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, సీడీఈడబ్ల్యూ కౌన్సెలింగ్ కేంద్రాల సేవలు, మానవ అక్రమ రవాణా, లింగ సమానత్వం, సీసీటీవీ ప్రాముఖ్యతపై వివరించారు….

మొయినాబాద్ సదర్ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

రంగారెడ్డి నవంబర్ 12: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని కాశీనాథ్ గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన సదర్ సమ్మేళనానికి కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ జైపాల్ యాదవ్ మరియు మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా యాదవ సోదరులు నిర్వహించిన సదర్ సమ్మేళనంలో పాల్గొని వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యాదవుల ఐక్యత, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని…

కులవివక్షకు తావులేకుండా అందరికీ ఆలయ ప్రవేశ హక్కు కల్పించాలి

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో జాతీయ దేవాలయ ప్రవేశ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కులాలకు చెందిన ప్రజలు ఐక్యంగా దేవాలయంలోకి ప్రవేశించి శివునికి అభిషేకం నిర్వహించారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సామాజిక సమరసత వేదిక కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు తుమ్మ రామచంద్రం మాట్లాడుతూ.. 1936 నవంబర్ 12న ట్రావెన్‌కోర్ సంస్థాన మహారాజు శ్రీ చితిర తిరునాళ్ బలరామ వర్మ దేవాలయ ప్రవేశ ప్రకటన…

నాబార్డ్ నిధులతో బ్రాహ్మణపల్లి పాఠశాల అభివృద్ధికి బాటలు.. ఎమ్మెల్యే మదన్ మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం

తాడ్వాయి: మండలంలోని బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం నాబార్డ్ నిధుల నుంచి రూ.1 కోటి 8 లక్షల 4 వేల రూపాయలు మంజూరు చేయించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం గ్రామంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అభినందనీయమని, నిధుల మంజూరుతో పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు…

హల్దీ వేడుకలో వధువుకు పట్టువస్త్రాలు అందజేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి దంపతులు

కల్వకుర్తి, నవంబర్ 12: ఈ నెల 15వ తేదీన కల్వకుర్తి మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్, కొండూరు మాధవి దంపతుల కుమార్తె వివాహం జరగనున్న నేపథ్యంలో,బుధవారం ఎస్.పి.ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించిన హల్దీ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి దంపతులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వధువుకు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న వధువు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు బాన్సువాడ విద్యార్థి సోఫియాన్ ఎంపిక!

బాన్సువాడ: సంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న 70వ వార్షిక రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో అండర్‌-14 వాలీబాల్ విభాగంలో పాల్గొనేందుకు బాన్సువాడ పట్టణంలోని సింధు విద్యాలయం 8వ తరగతి విద్యార్థి సోఫియాన్ ఎంపికయ్యాడు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం జ్ఞానేశ్వర్, అనిల్, ప్రిన్సిపల్ జగన్‌తో పాటు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ సోఫియాన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో…

గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులకు పి. రాములునేత శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్‌లను జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి. రాములునేత మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్డ, కమర్షియల్ ట్యాక్స్ అధికారి బి. శ్యామ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని గెజిటెడ్…