రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్‌లను జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి. రాములునేత మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్డ, కమర్షియల్ ట్యాక్స్ అధికారి బి. శ్యామ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని గెజిటెడ్ అధికారులు అందరికీ సుఖసంతోషాలు కలగాలని, ప్రభుత్వ పరంగా తగిన ప్రోత్సాహకాలు అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ, ఉద్యోగులందరూ ప్రశాంతమైన వాతావరణంలో విధులు నిర్వహించుకునేలా నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి. రాములునేతతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొని నూతనంగా ఎన్నికైన నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.