నాగర్‌కర్నూల్ జిల్లాలో ఉద్యోగ అవకాశం.. రోడ్డు భద్రతా సమన్వయకర్త పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.!

1001354835.jpg

నెలకు రూ.40 వేల వేతనం.. దరఖాస్తుకు ఈ నెల 21 చివరి గడువు

నాగర్‌కర్నూల్,నవంబర్ 12: నాగర్‌కర్నూల్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తూ జిల్లా రోడ్డు భద్రతా సమన్వయకర్త పోస్టు భర్తీకి జిల్లా కలెక్టర్ కార్యాలయం దరఖాస్తులు ఆహ్వానించింది.ఈ మేరకు అర్హత కలిగిన స్థానిక అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.ఈ పోస్టుకు సివిల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.40 వేల వేతనం చెల్లించనున్నారు.ఒక పోస్టును ఏడాది కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు.అర్హత, ఆసక్తి కలిగిన నాగర్‌కర్నూల్ జిల్లా స్థానిక అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకుని ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు కోరారు.

You may also like...