Category: జిల్లా వార్తలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ పట్టణంలోని పీవీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన వివాహ వేడుకకు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మండలంలోని పలువురు గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

మీసేవ సేవలు ఇక ఇంటి వద్దకే..

 ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) శాఖ, సైబరాబాద్ పోలీస్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా ‘మీ సేవ డోర్‌స్టెప్ డెలివరీ’ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, గేటెడ్ కమ్యూనిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్…

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

త్రిపురారం :- మండల పరిధిలోని కళ్యాణి రైస్ మిల్లు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రిపురారం గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం గ్రామానికి చెందిన పర్వతం మహేష్ (24), తండ్రి అంజయ్య, గురువారం ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై త్రిపురారం నుంచి మిర్యాలగూడకు వెళ్తుండగా కళ్యాణి రైస్ మిల్లు సమీపంలో అకస్మాత్తుగా గేదెలు రోడ్డుపైకి వచ్చాయి. వాటిని తప్పించబోయే క్రమంలో…

ఎండిన పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

 సంగారెడ్డి :- హత్నూర మండలంలోని నస్తీపూర్ గ్రామంలో గురువారం నాడు వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) మహేందర్ స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోయిన పంట పొలాలను ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నష్టం వివరాలను నమోదు చేశారు.ఈ సందర్భంగా ఏఈఓ మహేందర్ మాట్లాడుతూ, వర్షాలు లేక పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి, ఆ నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. కాబట్టి పంట నష్టపోయిన…

నీటిపారుదల డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు – రూ.100 కోట్ల అక్రమాస్తులు.!

నాగర్ కర్నూల్ నవంబర్ 12 :నాగర్‌కర్నూల్ జిల్లాలో నీటిపారుదల శాఖ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు భారీ దాడులు చేశారు.ఆయనపై కేసు నమోదు చేసి ఒకేసారి రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌లోని బైరమల్‌గూడ మాధవరం సరే నీటి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఆయన నివాసంతో పాటు ఇతర చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.ఇప్పటి వరకు రూ.100 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ చలపతి వెల్లడించారు.తనిఖీల్లో…

బీబీపేటలో రాష్ట్రస్థాయి హాకీ పోటీలు

కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి జిల్లా హాకీ పోటీలు ప్రారంభమవుతున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. అండర్ 14 నిర్వహించనున్న ఈ హాకీ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. క్రీడల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 15 వరకు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి…

కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ ఆదేశాలతో ధాన్యం విక్రయించే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులను స్వాధీనం చేసుకున్నారు. నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని సూచించింది. రైతుల కష్టానికి తగిన మద్దతు ధరను సకాలంలో చెల్లించాలని స్పష్టం చేశారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అధికారులతో అంతర్ చర్య ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు…

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి మారుమూల గ్రామాలు తండాలు అభివృద్ధి కోసం ప్రభుత్వ అధికారులను తీసుకొని రాత్రింబవళ్లు తిరుగుతు వారి సమస్యలు పరిష్కరిస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు.

నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి. నకిరేకల్ ఏఎంసీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 12: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరవేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమంలో భాగంగా గురువారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక అధికారి సతీష్ అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో…

డంప్‌యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారం కై,మంత్రి శ్రీధర్ బాబుకు వినతి

 మేడ్చల్–మల్కాజిగిరి, డంప్‌యార్డ్ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు రాష్ట్ర ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. డంప్‌యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, వాయు కాలుష్యం కారణంగా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై కాలుష్య ప్రభావం పడుతోందని, ఈ…