Category: జిల్లా వార్తలు

వాట్సాప్‌ ఆర్డర్లు.. రాపిడో డెలివరీలు!

హైదరాబాద్‌: నిషేధిత ఈ-సిగరెట్లు (వేప్స్‌) విక్రయించేందుకు అక్రమ వ్యాపారులు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ, రాపిడో సేవలను ఉపయోగించి వినియోగదారుల ఇళ్లకే వేప్స్‌ చేరవేస్తున్న వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ దందాపై ఈగల్‌ తెలంగాణ బృందం, రాయదుర్గం పోలీసులు...

గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్‌

వరంగల్‌: గంజాయి అక్రమ విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. వరంగల్‌ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తి క్రాస్‌ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 30 గ్రాముల గంజాయితో పాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు...

మహిళా పోలీస్‌కు ఘనంగా శ్రీమంతం

నారాయణపేట: విధి నిర్వహణలో క్రమశిక్షణతో బాధ్యతలు నిర్వర్తించే పోలీస్‌ సిబ్బంది.. సహచరుల వ్యక్తిగత జీవితంలోని సంతోషాల్లోనూ కుటుంబ సభ్యుల్లా తోడుగా నిలిచారు. నారాయణపేట పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్‌ (WPC) శిరీషకు పోలీస్‌ సిబ్బంది ఘనంగా శ్రీమంతం వేడుక నిర్వహించి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సీఐ...

హైదరాబాద్ సీపీగా ఇక సెలవు!

హైదరాబాద్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా గడిచిన ఏడాది కాలం తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అపురూపమైన ప్రయాణమని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సందర్భంగా ఆయన భావోద్వేగపూరిత సందేశాన్ని విడుదల చేశారు. చారిత్రక హైదరాబాద్ నగరానికి పోలీస్ కమిషనర్‌గా...

పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి

వరంగల్‌: నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధికారులు నిర్ణయించారు. కేసుల దర్యాప్తులో జాప్యానికి తావులేకుండా ప్రతి కేసుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, నిందితులను త్వరితగతిన అరెస్ట్‌ చేయాలని పోలీసు అధికారులకు సూచించారు....

మీర్‌పేట్‌లో మహిళ దారుణ హత్య

మీర్‌పేట్: షేర్ మార్కెట్‌లో భారీ నష్టాలు.. ఆర్థిక ఇబ్బందులు.. బంగారం దోచుకోవాలనే దురాశ.. వెరసి ఓ మహిళ ప్రాణాలను బలిగొన్నాయి. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో మహిళ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. శ్రీలక్ష్మి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న కేంద్ర...

నకిలీ పత్రాలతో ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.30 లక్షల టోకరా!

రంగారెడ్డి జిల్లా: ఉద్యోగం లేదు.. బ్యాంకు ఖాతా లేదు.. స్థిరమైన ఆదాయం కూడా లేదు.. అయినప్పటికీ లక్షల్లో జీతం పొందుతున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఏకంగా రూ.30 లక్షల రుణం కాజేసిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో ప్రైవేటు బ్యాంకును బురిడీ...

మినార్ టీ ప్యాలెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

పరిగి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మినార్ టీ ప్యాలెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్ జాక్ రవి కుమార్ ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో బాలల,రఘువీర్,నితిన్, అనేం నరేష్,అంతిగారి సాయి,పృధ్వీ,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

డా.బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు-2026 కు ఎంపికైన బల్గురి శోభరాణి.

బహుజన సాహిత్య అకాడమీ Dr BR ambedkar నేషనల్ అవార్డు-2026కు బల్గురి శోభరాణి ఎంపికైనట్టు BSAజాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ తెలిపారు.పరిగి మండలం కిష్టాపూర్ గ్రామంకి చెందిన బల్గురి శోభరాణి పంచాయితీ కార్యదర్శిగా అంకితభావంతో విధులు నిర్వయిస్తూ మరియు గాయినిగా ఎన్నో పురస్కారాలు అందుకున్నందుకు జాతీయ స్థాయి గుర్తింపుగా BSA. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ అవార్డులునవంబర్ 15న న్యూఢిల్లీలో ఇవ్వనున్నట్లు తెలిపారు,ఈ సందర్భంగా శోభారాణికి పలువురు అభినందనలు తెలిపారు

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం – సీఐ జానకి రాంరెడ్డి.!

తలకొండపల్లి నవంబర్ 12: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సీఐ జానకి రాంరెడ్డి పిలుపునిచ్చారు.గురువారం తలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిషా ముక్త వికసిత్ భారత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత తమ అమూల్యమైన జీవితాలను,ఆరోగ్యాన్ని, భవిష్యత్తును, నాశనం చేసుకుంటున్నారు.అనంతరం పద్మ అనిల్ ముదిరాజ్ విద్యార్థుతో కలసి ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్ ముదిరాజ్, కళాశాల అధ్యాపకులు పరమేష్,మై…