ప్రకాష్ గౌడ్ కుమారుడి పెళ్లి వేడుక నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి.

429965.png

గండిపేట్ : రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. వట్టినాగులపల్లిలోని ఇవెంటారా కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ శుభకార్యానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసి సందడి చేశారు. వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రకాష్ గౌడ్ కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం, వారి దాంపత్య జీవితం కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

You may also like...