రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు బాన్సువాడ విద్యార్థి సోఫియాన్ ఎంపిక!
- రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు బాన్సువాడ విద్యార్థి సోఫియాన్ ఎంపిక! - November 12, 2026
- బాన్సువాడ చోరీల కేసు ఛేదన.. ఇద్దరు అరెస్ట్ - November 12, 2026
- దీపాల వెలుగుల్లో ప్రతి ఇంటా ఆనందం! - November 8, 2026
బాన్సువాడ: సంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న 70వ వార్షిక రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో అండర్-14 వాలీబాల్ విభాగంలో పాల్గొనేందుకు బాన్సువాడ పట్టణంలోని సింధు విద్యాలయం 8వ తరగతి విద్యార్థి సోఫియాన్ ఎంపికయ్యాడు. గురువారం కామారెడ్డిలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం జ్ఞానేశ్వర్, అనిల్, ప్రిన్సిపల్ జగన్తో పాటు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ సోఫియాన్ను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
