అవగాహనతోనే భద్రతకు తొలి అడుగు.. షీ టీమ్స్

  •  ఉప్పల్,  విద్యార్థినులు, మహిళల భద్రతతో పాటు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని మల్కాజిగిరి పోలీసులు సూచించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉప్పల్‌లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు షీ టీమ్స్ పనితీరు, వాస్తవ ఘటనల ఆధారంగా కేస్ స్టడీలు, సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, సీడీఈడబ్ల్యూ కౌన్సెలింగ్ కేంద్రాల సేవలు, మానవ అక్రమ రవాణా, లింగ సమానత్వం, సీసీటీవీ ప్రాముఖ్యతపై వివరించారు. అదేవిధంగా బాల్యవివాహాలు, చిన్నారులపై వేధింపులు, ర్యాగింగ్ నిరోధక చట్టాలు, జువెనైల్ జస్టిస్ (జేజే) చట్టం, టి-సేఫ్ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ విద్యార్థులు తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఏదైనా వేధింపులు, ఇబ్బందులు లేదా నేరాలకు సంబంధించిన ఘటనలు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. అత్యవసర సహాయం కోసం డయల్ 112కు ఫోన్ చేయాలని, మల్కాజిగిరి పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ 8712662111ను సంప్రదించాలని సూచించారు.

విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం ద్వారా సురక్షిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా  కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ తెలిపారు.

You may also like...