Category: జిల్లా వార్తలు

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.50 లక్షల విరాళం

 యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ఆప్టిమస్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ పార్ట్‌నర్ డాక్టర్ డి. శ్రీనివాసరెడ్డి రూ.50 లక్షల విరాళం అందించారు. మంగళవారం మైండ్‌స్పేస్‌లోని పెరెల్ క్లబ్‌లో నిర్వహించిన ఓపెన్ హౌస్ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్‌కు విరాళం చెక్కును అందజేశారు.ఈ నిధులను పాఠశాలలో తరగతి గదులు, సైన్స్, టెక్నాలజీ ల్యాబ్‌లు, గ్రంథాలయం, క్రీడా వసతులు, డిజిటల్ విద్యా సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు. పోలీసు సిబ్బంది పిల్లలతో పాటు సామాన్య ప్రజల…

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. పేదల కల సాకారం – ఎమ్మెల్యే కసిరెడ్డి

కల్వకుర్తి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడం ఆనందంగా ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. లక్షలాది పేద కుటుంబాలు సొంత ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కేవలం నివాసాలు మాత్రమే కాకుండా పేదల దశాబ్దాల…

పోలీసు కుటుంబాలకు నైపుణ్యాభివృద్ధి..

సైబరాబాద్,  పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమం, భవిష్యత్తు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సైబరాబాద్ పోలీస్ శాఖ ‘సంక్షేమ వారధి’ పేరుతో ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది పిల్లలు, జీవిత భాగస్వాములకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్ ఆఫీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…

ఘనంగా అంబేద్కర్ యువజన సంఘం 50వ స్వర్ణోత్సవ వేడుకల కరపత్రాల ఆవిష్కరణ

తాడ్వాయి: తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 50వ స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలనే లక్ష్యంతో తాడ్వాయి మండల కేంద్రంలో ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. మండల సంఘం ప్రధాన కార్యదర్శి గైని రాజలింగం, మండల ఇన్‌చార్జి గైని సంజీవ్, గడ్డం రవీందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలకు సంఘ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజు, ప్రభాకర్, సాయిలు, గంగారాం,…

నాయబ్ తహసీల్దార్ శృతిని సన్మానించిన అంబేద్కర్ సంఘం నాయకులు

తాడ్వాయి: మండల నూతన నాయబ్ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన కుమారి శృతి గారిని తాడ్వాయి మండల అంబేద్కర్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సత్కరించి, ఆమె నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి రాజలింగం, బదనకంటి సంతోష్, పులి ప్రభాకర్, గైని సంజీవ్, గడ్డం రవీందర్, సముద్రాల అఖిల్, చిట్యాల జీపీఓతో పాటు అంబేద్కర్ సంఘం నాయకులు…

సింగిల్ విండో డైరెక్టర్ కర్నాటి భగవాన్ రెడ్డికి ఘన సన్మానం

ఆమనగల్లు ప్రతినిధి నవంబర్ 10: ఆమనగల్లు మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన కర్నాటి భగవాన్ రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్‌గా ఎన్నికైన సందర్భంగా గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ గ్రామానికి చెందిన వ్యక్తి ఈ పదవికి ఎన్నిక కావడం సంతోషకరమని, రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు అర్హులైన ప్రతి రైతుకు చేరేలా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ అంజన్ రెడ్డి, రవి ప్రకాష్, వార్డు సభ్యులు చిన్న…

సర్పంచుల మాటకు విలువ ఇవ్వాలి.. అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి!

తాడ్వాయి: గ్రామాల అభివృద్ధి పనుల్లో సర్పంచులకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పించాలని ఎంపీడీవో భరత్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి రఘునందన్ అధ్యక్షతన మండల స్థాయి సర్వసభ్య సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. ప్రజాసేవే లక్ష్యంగా బాధ్యతలు చేపట్టిన తమను అభివృద్ధి పనుల విషయంలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ప్రతిపాదించిన పనులను పెండింగ్‌లో…

వ్యవసాయ వర్సిటీలో ఉద్రిక్తత.. బాధిత ప్రొఫెసర్‌కు అండగా తెలంగాణ రక్షణ సేన

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాధిత మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) శ్రేణులు నిరసన చేపట్టాయి.

మాజీ సర్పంచ్ సోమయ్య గారి జ్ఞాపకార్థం జరుగుతున్న LPL – 6.. ఫైనల్లో డామినేటర్స్, లయన్స్ అమీతుమీ

వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ మల్లేపాకుల సోమయ్య గారి స్మారకార్థం నిర్వహిస్తున్న లింగారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్ – 6 క్రికెట్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది.ఈ టోర్నమెంట్ లో కిశోర్ నేతృత్వంలోని రాయల్ వారియర్స్, నిజామ్ నేతృత్వంలోని గోల్డెన్ ఈగల్స్, పవన్ నేతృత్వంలోని డామినేటర్స్, రాజేష్ నేతృత్వంలోని టీమ్ లయన్స్ జట్లు పాల్గొని అభిమానులను అలరించాయి. ఉత్కంఠభరితంగా సాగిన లీగ్ మ్యాచ్ లు, సెమీ ఫైనల్స్ అనంతరం ఫైనల్ కు డామినేటర్స్…

కష్టకాలంలో కుటుంబానికి అండగా దైద రవీందర్ మృతుడి వెంకన్న కుటుంబాన్ని పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేత

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 10 : మండలంలోని బొల్లెపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తాటి వెంకన్న మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పార్టీ నాయకులతో కలిసి వెంకన్న మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం అందజేసి తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి, తండ్రికి తలకొరివి పెట్టి…