ఘనంగా అంబేద్కర్ యువజన సంఘం 50వ స్వర్ణోత్సవ వేడుకల కరపత్రాల ఆవిష్కరణ

తాడ్వాయి: తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం 50వ స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలనే లక్ష్యంతో తాడ్వాయి మండల కేంద్రంలో ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు. మండల సంఘం ప్రధాన కార్యదర్శి గైని రాజలింగం, మండల ఇన్‌చార్జి గైని సంజీవ్, గడ్డం రవీందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలకు సంఘ నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాజు, ప్రభాకర్, సాయిలు, గంగారాం, ప్రశాంత్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

You may also like...