యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు రూ.50 లక్షల విరాళం
- సైబరాబాద్ పరిధిలో భరోసా కేంద్రం ప్రారంభోత్సవం - November 10, 2026
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు రూ.50 లక్షల విరాళం - November 10, 2026
- పోలీసు కుటుంబాలకు నైపుణ్యాభివృద్ధి.. - November 10, 2026
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ఆప్టిమస్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ పార్ట్నర్ డాక్టర్ డి. శ్రీనివాసరెడ్డి రూ.50 లక్షల విరాళం అందించారు. మంగళవారం మైండ్స్పేస్లోని పెరెల్ క్లబ్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్కు విరాళం చెక్కును అందజేశారు.ఈ నిధులను పాఠశాలలో తరగతి గదులు, సైన్స్, టెక్నాలజీ ల్యాబ్లు, గ్రంథాలయం, క్రీడా వసతులు, డిజిటల్ విద్యా సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు. పోలీసు సిబ్బంది పిల్లలతో పాటు సామాన్య ప్రజల పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించడమే పాఠశాల లక్ష్యమని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అభివృద్ధికి దాతలు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. మరిన్ని పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సమాజ భద్రత కోసం పోలీసుల సేవలు ఎంతో విలువైనవని, వారి కుటుంబాల పిల్లల విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు.

