నాయబ్ తహసీల్దార్ శృతిని సన్మానించిన అంబేద్కర్ సంఘం నాయకులు

తాడ్వాయి: మండల నూతన నాయబ్ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన కుమారి శృతి గారిని తాడ్వాయి మండల అంబేద్కర్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సత్కరించి, ఆమె నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి రాజలింగం, బదనకంటి సంతోష్, పులి ప్రభాకర్, గైని సంజీవ్, గడ్డం రవీందర్, సముద్రాల అఖిల్, చిట్యాల జీపీఓతో పాటు అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

You may also like...