మాజీ సర్పంచ్ సోమయ్య గారి జ్ఞాపకార్థం జరుగుతున్న LPL – 6.. ఫైనల్లో డామినేటర్స్, లయన్స్ అమీతుమీ
- మాజీ సర్పంచ్ సోమయ్య గారి జ్ఞాపకార్థం జరుగుతున్న LPL – 6.. ఫైనల్లో డామినేటర్స్, లయన్స్ అమీతుమీ - November 10, 2026
- ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి - November 6, 2026
- వెల్దండ మండల సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్యకు ఘన సన్మానం - November 5, 2026
వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ మల్లేపాకుల సోమయ్య గారి స్మారకార్థం నిర్వహిస్తున్న లింగారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ సీజన్ – 6 క్రికెట్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది.ఈ టోర్నమెంట్ లో కిశోర్ నేతృత్వంలోని రాయల్ వారియర్స్, నిజామ్ నేతృత్వంలోని గోల్డెన్ ఈగల్స్, పవన్ నేతృత్వంలోని డామినేటర్స్, రాజేష్ నేతృత్వంలోని టీమ్ లయన్స్ జట్లు పాల్గొని అభిమానులను అలరించాయి. ఉత్కంఠభరితంగా సాగిన లీగ్ మ్యాచ్ లు, సెమీ ఫైనల్స్ అనంతరం ఫైనల్ కు డామినేటర్స్ మరియు టీమ్ లయన్స్ జట్లు చేరుకున్నాయి.రేపు జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో పవన్ నేతృత్వంలోని డామినేటర్స్, రాజేష్ నేతృత్వంలోని టీమ్ లయన్స్ జట్లు తలపడనున్నాయి. మాజీ సర్పంచ్ మల్లేపాకుల సోమయ్య గారి సంవత్సరీకం సందర్భంగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ కోసం గ్రామస్తులు, క్రీడాభిమానులు
ఆసక్తిగాఎదురుచూస్తున్నారు.అనంతరం జరగనున్న బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మల్లేపాకుల శేఖర్ గారు, రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, ఏడ్మ సత్యం గారు మరియు ఇతర నాయకులు హాజరుకానున్నారు.
గ్రామంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
