Category: జిల్లా వార్తలు

కొర్రములలో ఘనంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం

మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ కొర్రముల గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, యాదవ సంఘం నాయకులు, పెద్దలు, యువకులతో కలిసి సదర్ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ…..

ఉస్మానియా ఉద్యోగులకు భద్రత కల్పించాలి ఎంపీ ఈటల రాజేందర్

 విశ్వవిద్యాలయ నాన్‌ టీచింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మెకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మెలో పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆకలితో ఉన్నవారితో చెలగాటం ఆడవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, టైమ్‌స్కేల్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 2023 నుంచి పెండింగ్‌లో ఉన్న రూ.1,700 వేతన పెంపును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఈపీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి కనీస…

కరువు సాయం వెంటనే ప్రకటించాలి సిపిఐ మహేష్

సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నేడు భారత కమ్యూనిస్టు పార్టీ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కరువు వల్ల ఉపాధి కోల్పోతున్న మరియు పంట నష్టం తో ఇబ్బంది పడే రైతులను కార్మికులను ఆదుకోవాలనే డిమాండ్ తో  నేడు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.      ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఎస్ బోస్ గారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర…

అంత్యక్రియలకు ఆర్థిక సాయం

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వాంబే కాలనీకి చెందిన వెంకటేష్(55) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ మాజీ కార్పొరేటర్  దొడ్ల వెంకటేష్ గౌడ్  స్థానిక నాయకులను ఆదేశించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి డివిజి ట్రస్ట్ ద్వారా 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఎత్తారి శ్రీను, కమ్మారి మురళి, రాకేష్ చవాన్, శ్యామల్ రావు, రాజు యాదవ్, భాస్కర్ కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు 

విదేశీ విద్యకు ప్రభుత్వఆర్థిక సాయం

హైదరాబాద్విద్యకు మాత్రమే సమాజాన్ని మార్చగలిగే శక్తి ఉందని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ అన్నారు.మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశీ విద్యకు అర్హత సాధించిన రౌలకోల వంశీకి ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం పార్టీ కార్యాలయంలో సంబంధిత పత్రాలను బండి రమేష్ విద్యార్థికి అందజేసి అభినందించారు.ఈ…

నందివాడ, చిట్యాల, ఎర్రపహాడ్ గ్రామాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశాలు – యువ మోర్చా కమిటీల నియామకం

తాడ్వాయి మండలంలోని నందివాడ, చిట్యాల, ఎర్రపహాడ్ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా బీజేపీ తాడ్వాయి మండల అధ్యక్షులు వెల్మ సంతోష్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు పాటిమిది గంగారెడ్డి గారు, BJYM తాడ్వాయి మండల అధ్యక్షులు రెడ్డిగారి తిరుపతి రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా నూతనంగా BJYM తాడ్వాయి మండల అధ్యక్షులుగా ఎన్నికైన రెడ్డిగారి తిరుపతి రెడ్డి…

కైసర్‌నగర్‌లో 2BHK ఇళ్ల పట్టాల పంపిణీ

   కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మహాదేవపురం పరిధిలోని కైసర్‌నగర్‌లో 2BHK ఇళ్లకు సంబంధించి గతంలోనే మంజూరైనప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాలను  కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా కొర్వి లక్ష్మి, మమతా, గౌసియా బేగమ్‌లకు 2BHK ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం కొలన్ హన్మంత్ రెడ్డి  మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని,…

ప్యాకేజీలు పాచిపోయిన లడ్డూలు మాకొద్దు.! మా భూమిలే మాకు ముద్దు.!

ఎమ్మార్వో ముందే తెగేసి చెప్పిన ఎర్రవల్లి నిర్వాసితులు.. తగ్గేదెలే.!కల్వకుర్తి నవంబర్ 10 :ప్యాకేజీలు పాచిపోయిన లడ్డూలు మాకొద్దు.. మా భూమిలో మాకు ముద్దు..!అంటూ ఎర్రవల్లి భూ నిర్వాసితులు ఎమ్మార్వో ముందే తేల్చి చెప్పారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎర్రవల్లి భూ నిర్వాసితులతో వెల్దండ ఎమ్మార్వో కార్తీక్ కుమార్ పునరావాసం మరియు పునర్నిర్మాణం ఆర్ మరియు ఆర్ విషయంపై చర్చలు జరిపారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. ప్రాజెక్టు యదావిధిగా కొనసాగుతుందని, మీ ఎర్రవల్లి,ఎర్రవల్లి తండాలకు ఆర్.అండ్.ఆర్ ప్యాకేజీ ఇవ్వడానికి ప్రభుత్వం…

సైబరాబాద్ పరిధిలో భరోసా కేంద్రం ప్రారంభోత్సవం

 మహిళలు, చిన్నారుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలిలో మహిళలు, చిన్నారుల భద్రతా విభాగం (Women & Children Safety Wing) కోసం ప్రత్యేకంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ మంగళవారం ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భవనంలో షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్…

జూపల్లిలో ఘనంగా భాస్కర్ రావు జన్మదిన వేడుకలు

వెల్దండ, నవంబర్ 10: జూపల్లి గ్రామంలో వెల్దండ సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీమర్ల సత్యం యాదవ్, భాస్కర్ రావు యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, భాస్కర్ రావు యువసేన సభ్యులు పాల్గొన్నారు.