Category: జిల్లా వార్తలు

ప్రతి దుకాణానికి గ్రామపంచాయతీ వ్యాపార లైసెన్స్ తప్పనిసరి

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలోని చిరు వ్యాపారుల యజమానులతో గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రవి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ శివరాజ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి దుకాణం యజమాని తప్పనిసరిగా గ్రామ పంచాయతీ నుంచి వ్యాపార లైసెన్స్ పొందాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తదితర మత్తు పదార్థాలను విక్రయించరాదని స్పష్టం చేశారు.గ్రామ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గ్రామంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు….

రైతు పొలంలో మొసలి ప్రత్యక్షం

 కాలువ పక్కన ఉన్న రైతు శివమణి పొలంలో గట్టుపైన కనిపించిందిఝరాసంగం వర్షాలు పడక చెరువు ఎండిపోవడంతో అందులో ఉండవలసిన ముసలి రైతు పొలంలో ప్రత్యక్షం మైంది ఈ ఘటన ఝరాసంగం మండలం పరిధిలోని జెర్లపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం జీర్లపల్లి చెరువులో నీరు అడుగు గంటడంతో కాలువ పక్కన రైతు శివమణి పొలం గట్టుపై కనిపించింది. ముసలిని గమనించిన చుట్టుపక్కల రైతులు విషయాన్ని స్థానిక తాసిల్దార్ భాస్కర్…

రాయల్ ఫ్రూట్స్ షాప్‌ను సందర్శించిన జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని రంజోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన రాయల్ ఫ్రూట్స్ షాప్‌ను జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులతో ఆత్మీయంగా మాట్లాడి, వ్యాపార విశేషాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, కోహీర్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సింలు, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రవికిరణ్, సీనియర్ నాయకులు ఆనంద్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు ప్రవీణ్,…

తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ .!

తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ .!

కల్వకుర్తి సమస్యలపై చర్చ.. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు విజయవంతం చేయాలని కేటీఆర్ సూచనకల్వకుర్తి : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.అనంతరం కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి,…

తాగునీటి సౌకర్యం కల్పించడమే ప్రధాన లక్ష్యం

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కొల్లూరు గ్రామంలో వి.బి.జి.ఆర్.ఎ.ఎం. నిధుల నుంచి పశువుల తాగునీటి సౌకర్యం కోసం రెండు నీటి తొట్టెల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు.గ్రామంలోని గేదెలు, ఆవులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు తదితర పశువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కడుపునిండా తాగునీరు అందించడమే ఈ నిర్మాణాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామంలో నీటి తొట్టెల ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్థులు…

పట్టభద్రుల గొంతుకనవుతా.. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వండి – కేటీఆర్ కు ఎల్ ఎన్ రెడ్డి విజ్ఞప్తి

కల్వకుర్తి: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు గూడూరు లక్ష్మీ నర్సింహ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, సర్పంచిగా, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవాన్ని కేటీఆర్‌కు వివరించారు. అవకాశం కల్పిస్తే పట్టభద్రులు, నిరుద్యోగ యువత సమస్యలపై పోరాడటంతో పాటు పార్టీ బలోపేతానికి…

కేటీఆర్ చేతుల మీదుగా భాస్కర్ రావుకు ఘన సన్మానం..! జన్మదిన వేడుకలో సందడి..!

కల్వకుర్తి /హైదరాబాద్ నవంబర్ 10 :బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ ను టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వెల్దండ మండల సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి భాస్కరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా భాస్కరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిబద్ధతతో పనిచేసే బీఆర్ఎస్ పార్టీ నాయకులలో భాస్కరరావు ఒకరని కొనియాడారు. ఆయన ఇలాంటి…

జహీరాబాద్ నుంచి టీపీసీసీ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా అమిత్ రాజ్

జహీరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అమిత్ రాజ్ (అంజి) నియమితులయ్యారు. ఈ మేరకు మానకొండూరు శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ వర్గాల అభ్యున్నతికి అమిత్ రాజ్ అందిస్తున్న సేవలు, చేస్తున్న నిరంతర కృషిని గుర్తించి ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా…

విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ విద్యుత్ సరఫరా తదితర అంశాలపై విద్యుత్ శాఖ అధికారులతో జహీరాబాద్ ఎమ్మెల్యే శ్రీ కొనింటి మాణిక్ రావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ…నియోజకవర్గంలోని ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని, రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు..గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే…