ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. పేదల కల సాకారం – ఎమ్మెల్యే కసిరెడ్డి
- ప్యాకేజీలు పాచిపోయిన లడ్డూలు మాకొద్దు.! మా భూమిలే మాకు ముద్దు.! - November 10, 2026
- జూపల్లిలో ఘనంగా భాస్కర్ రావు జన్మదిన వేడుకలు - November 10, 2026
- ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. పేదల కల సాకారం – ఎమ్మెల్యే కసిరెడ్డి - November 10, 2026

కల్వకుర్తి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడం ఆనందంగా ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. లక్షలాది పేద కుటుంబాలు సొంత ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవడం మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కేవలం నివాసాలు మాత్రమే కాకుండా పేదల దశాబ్దాల కలలకు సాకారం, ఆత్మగౌరవానికి ప్రతీకలని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడం మరింత బాధ్యతతో పనిచేయాలనే సంకల్పాన్ని బలపరిచిందన్నారు.ఈ కార్యక్రమ విజయానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
