Category: జిల్లా వార్తలు

తెలంగాణలో 4.63 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మందికి పింఛన్లు మంజూరు చేసింది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదు జమ చేయనుంది. వీరిలో 2,77,894 మంది వితంతువులు, 1,00,224 మంది దివ్యాంగులు, 53,844 మంది ఒంటరి మహిళలు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులు ఉన్నారు. అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

సైక్లోథాన్‌లో 2,500 మంది సైక్లిస్టుల సందడి

హైదరాబాద్‌లో ఆదివారం ప్రైమ్ అరేనాలో నిర్వహించిన మూడో ఎడిషన్ హెచ్‌సీఎల్ హైదరాబాద్ సైక్లోథాన్‌లో 2,500 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, జాయింట్ సీపీ ట్రాఫిక్ సున్‌ప్రీత్ సింగ్ తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా సైక్లిస్టుల భాగస్వామ్యాన్ని పెంచాలని కమిషనర్ పిలుపునిచ్చారు. నగరంలో ప్రతిరోజూ 10 లక్షలకు పైగా వాహనాలు రోడ్లపై తిరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రజా రవాణా, కార్‌పూలింగ్, సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. నవంబర్ 26…

ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షల హామీ.. తొలి విడతగా రూ.3 లక్షల చెక్ అందజేత.!

కడ్తాల్, నవంబర్ 15: ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు.కడ్తాల్ మండలం సాలార్పూర్ తండాలో నిర్మాణంలో ఉన్న శ్రీ శివరామాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని గతంలో ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం మరోసారి తండాను సందర్శించి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇచ్చిన…

హత్నూర డీజేఎఫ్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక*

 సంగారెడ్డి:-  సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల హక్కుల సాధన, ఐక్యత, సంక్షేమమే లక్ష్యంగా దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) హత్నూర మండల కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీజేఎఫ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ముక్కగళ్ల యాదన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ వరిగుంతం శంకర్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించి కమిటీ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మండల గౌరవ అధ్యక్షుడిగా మీనంపల్లి కిషన్ రావు, అధ్యక్షుడిగా మద్దెల పోచయ్య, ఉపాధ్యక్షుడిగా నాయికోటి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా పరమేషుల కిష్టయ్య,…

జాబ్ మేళాతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు : కట్టంగూర్ సర్పంచ్ శ్యామల శేఖర్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 15 : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహించినట్లు కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ఆదివారం కట్టంగూర్ జీపీ కార్యాలయంలో ఆపద్బాంధవ ఫౌండేషన్ సహకారంతో ఫాక్స్ కాన్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్మేళాను ఆమె ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత…

శుభకార్యాలు, ప్రజా కార్యక్రమాల్లో ఉప్పల వెంకటేష్ సందడి – బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం.!

జ్ఞాన తెలంగాణ,కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 15 : రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి నియోజకవర్గంలో ఆదివారం పలు శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కల్వకుర్తి పట్టణంలోని రాయల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్‌లో జీడిపల్లి మాజీ ఉపసర్పంచ్ మహమ్మద్ ఖాజా కుమార్తె సారీ ఫంక్షన్‌కు, పార్థసారథి ఫంక్షన్ హాల్ సమీపంలోని కల్వకుర్తి డైరీస్ కార్యాలయానికి వెళ్లి కార్తీక్‌ను కలిశారు. అనంతరం కళ్యాణ్ నగర్‌లో…

వీకెండ్ స్పెషల్ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. వందలాదిగా కేసులు నమోదు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వందలాది మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో 233 మంది ద్విచక్ర వాహనదారులు, 11 మంది ఆటో డ్రైవర్లు, 36 మంది కార్ల డ్రైవర్లు, ఇద్దరు భారీ వాహనదారులు ఉన్నారు. బీఏసీ పరీక్షల్లో 232 మందికి 36–200 ఎంజీ, 39 మందికి 201–300 ఎంజీ, 11 మందికి 301–550 ఎంజీ ఆల్కహాల్ స్థాయులు నమోదయ్యాయి. పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. మద్యం మత్తులో…

పేదరికం ప్రతిభకు అడ్డుకాకూడదు.. టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.!

కల్వకుర్తి నవంబర్ 15: గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చేరువ చేయాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఎస్సై కానిస్టేబుల్ శిక్షణ రెండో బ్యాచ్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ…

సజ్జనార్‌పై ఆరోపణలు.. సీబీఐ విచారణకు రాజాసింగ్ డిమాండ్

హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కేసులు, పెండింగ్ దర్యాప్తులు, ఆర్థిక లావాదేవీలపై స్వతంత్ర విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బంగారం చోరీ, హమ్వే, ఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కర్ణాటకలో సుమారు 100 ఎకరాల భూమి కొనుగోలు ప్రచారంపైనా విచారణ జరిపి, ఆదాయానికి మించి ఆస్తులున్నాయో తేల్చాలని కోరారు. సీబీఐ లేదా న్యాయ…

దళితుల ఆత్మగౌరవంపై దాడిని సహించం!

దౌల్తాబాద్: దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించబోమని, సామాజిక ఆధిపత్య ధోరణులకు ప్రజాస్వామ్య ఉద్యమాల ద్వారా గట్టి సమాధానం చెబుతామని బీఆర్‌ఎస్‌, బీఎస్పీ, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, ఎమ్మార్పీఎస్‌, దళిత ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ మండలం కుప్పగిరి గ్రామంలో ప్రస్తుత సర్పంచ్...