ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షల హామీ.. తొలి విడతగా రూ.3 లక్షల చెక్ అందజేత.!
- వెల్దండ సర్పంచుకు సీఐ నర్సింహులు ఆత్మీయ సత్కారం.! - November 15, 2026
- కల్వకుర్తిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంపై ప్రతిపక్ష సర్పంచ్ల అభ్యంతరం.! - November 15, 2026
- అక్షరాల రూపంలో జీవిత ఆటుపోట్లు.. ‘ఆటుపోట్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సుంకిరెడ్డి! - November 15, 2026
కడ్తాల్, నవంబర్ 15: ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు.కడ్తాల్ మండలం సాలార్పూర్ తండాలో నిర్మాణంలో ఉన్న శ్రీ శివరామాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తానని గతంలో ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం మరోసారి తండాను సందర్శించి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతగా రూ.3 లక్షల చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. మిగిలిన రూ.2 లక్షల సహాయం కూడా అందించనున్నట్లు తెలిపారు.అనంతరం వాసుదేవ్‌పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాజీవ్‌నగర్ తండాలో కొలువైన శ్రీ తుల్జా భవానీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారుల చేతుల మీదుగా తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ప్రియా రమేష్, కేతావత్ రమేష్ నాయక్, అమర్ సింగ్, ఉపసర్పంచులు మహేశ్వరి కుమార్, ఎర్ర రామకృష్ణ, రమేష్, మాజీ సర్పంచ్ శంకర్, సీనియర్ నాయకులు మోహన్, పకీర, జగన్, పాండు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
