హత్నూర డీజేఎఫ్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక*

 సంగారెడ్డి:-  సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల హక్కుల సాధన, ఐక్యత, సంక్షేమమే లక్ష్యంగా దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) హత్నూర మండల కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డీజేఎఫ్ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ముక్కగళ్ల యాదన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ వరిగుంతం శంకర్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించి కమిటీ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మండల గౌరవ అధ్యక్షుడిగా మీనంపల్లి కిషన్ రావు, అధ్యక్షుడిగా మద్దెల పోచయ్య, ఉపాధ్యక్షుడిగా నాయికోటి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా పరమేషుల కిష్టయ్య, సహాయ కార్యదర్శిగా కొండేగల్ల శ్రీధర్, కోశాధికారిగా బక్కోల్ల ప్రతాప్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బ్యాగరి శ్రీహరి, వరిగుంతం శంకర్, ఆవుల మల్లేష్, నీరుడి మనోహర్, తూర్పాటి రమేశ్, బ్యాగరి పద్మారావు, నాయికోటి పవన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ముక్కగల్ల యాదన్న మాట్లాడుతూ.. ఈ నెల 18న సంగారెడ్డిలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్న డీజేఎఫ్ 11వ రాష్ట్ర మహాసభలకు జర్నలిస్టులందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దళిత జర్నలిస్టుల హక్కులు, భద్రత, సామాజిక న్యాయం, అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు, ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జర్నలిస్టులందరూ పెద్దఎత్తున తరలివచ్చి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

Kondagalla Sridhar

I'm Sridhar kondagalla from Hathnoora vill., mdl., sangareddy dist I'm working as Reporter correspondent to Narsapur constituency at the paper of print & electronic media named Gnana telangana

You may also like...