జాబ్ మేళాతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు : కట్టంగూర్ సర్పంచ్ శ్యామల శేఖర్
- జాబ్ మేళాతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు : కట్టంగూర్ సర్పంచ్ శ్యామల శేఖర్ - November 15, 2026
- లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద శిబిరం - November 14, 2026
- ఘనంగా బాలల దినోత్సవం - November 14, 2026
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 15 : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహించినట్లు కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ఆదివారం కట్టంగూర్ జీపీ కార్యాలయంలో ఆపద్బాంధవ ఫౌండేషన్ సహకారంతో ఫాక్స్ కాన్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాను ఆమె ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జాబ్ మేళాను ఏర్పాటు చేసిన ఆపద్బాంధవ ఫౌండేషన్, పాకన్ కంపెనీ సభ్యులను అభినందించారు. జాబ్ మేళాకు 150 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా వారిలో 100 మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఏకుల సుజాతసైదులు, ఏనుగు సైదులు, శ్రీరామ సంధ్య, పులకరం శ్రీను, కళ్లెం నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
