సైక్లోథాన్‌లో 2,500 మంది సైక్లిస్టుల సందడి

  • హైదరాబాద్‌లో ఆదివారం ప్రైమ్ అరేనాలో నిర్వహించిన మూడో ఎడిషన్ హెచ్‌సీఎల్ హైదరాబాద్ సైక్లోథాన్‌లో 2,500 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, జాయింట్ సీపీ ట్రాఫిక్ సున్‌ప్రీత్ సింగ్ తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా సైక్లిస్టుల భాగస్వామ్యాన్ని పెంచాలని కమిషనర్ పిలుపునిచ్చారు. నగరంలో ప్రతిరోజూ 10 లక్షలకు పైగా వాహనాలు రోడ్లపై తిరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రజా రవాణా, కార్‌పూలింగ్, సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. నవంబర్ 26 నుంచి 28 వరకు టీ-హబ్, టీ-వర్క్స్‌లో నిర్వహించనున్న ‘సైబరాబాద్ మూవ్స్’ కార్యక్రమంలో పౌరులు, సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు.

You may also like...