రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all)
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మందికి పింఛన్లు మంజూరు చేసింది. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదు జమ చేయనుంది. వీరిలో 2,77,894 మంది వితంతువులు, 1,00,224 మంది దివ్యాంగులు, 53,844 మంది ఒంటరి మహిళలు, 27,444 మంది గీత కార్మికులు, 4,451 మంది చేనేత కార్మికులు ఉన్నారు. అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
