రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all)
హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కేసులు, పెండింగ్ దర్యాప్తులు, ఆర్థిక లావాదేవీలపై స్వతంత్ర విచారణ జరిపించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బంగారం చోరీ, హమ్వే, ఫోన్ ట్యాపింగ్ కేసుల దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. కర్ణాటకలో సుమారు 100 ఎకరాల భూమి కొనుగోలు ప్రచారంపైనా విచారణ జరిపి, ఆదాయానికి మించి ఆస్తులున్నాయో తేల్చాలని కోరారు. సీబీఐ లేదా న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
