పట్టభద్రులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి..జంగిలి యాదగిరి
- బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ - October 15, 2026
- డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా - October 15, 2026
- ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు - October 15, 2026
వెల్దండ:మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన పట్టభద్రులందరూ బాధ్యతగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వెల్దండ మండల బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు జంగిలి యాదగిరి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం వెల్దండ తహసీల్దార్ కార్తీక్ కుమార్కు ఓటు నమోదు దరఖాస్తు ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో విద్యావంతులైన యువత, ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యువ నాయకుడు గోరటి దశరథం పాల్గొన్నారు.
