ప్రజా నాయకుడికి ప్రజల ఆశీస్సులు.! వెల్దండ లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

1001341393.jpg

వెల్దండ,నవంబర్ 08: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు వెల్దండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హరికిషన్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఇటీవల వెల్దండ సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికైన నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్నం భూపతిరెడ్డితో పాటు నూతన డైరెక్టర్లుగా ఎన్నికైన కొయ్యల పుల్లయ్య, జక్కుల శ్రీనివాస్, గంగదారి మల్లేష్‌లను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హరికిషన్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకట గౌడ్ శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ.. సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, ఉప సర్పంచ్ శ్రీనివాసు ముదిరాజ్, టౌన్ అధ్యక్షుడు బాదేపల్లి మల్లయ్య, సర్పంచులు ప్రసాద్ గౌడ్, అన్వర్ పాషా, గన్యా నాయక్, సీనియర్ నాయకులు తక్కళ్లపల్లి శేఖర్, రాములు, సక్రు నాయక్, వార్డు సభ్యులు గుద్దేటి కిష్టాల్, ముదిగొండ రమేష్, మారేపల్లి శ్రీను, ఎండీ రషీద్, హమీద్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ గౌడ్ తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...