మొబైల్ ఫిలిం మేకింగ్ తో యువతకు సృజనాత్మకత కొత్త అవకాశాలు
- బీరం హర్షవర్ధన్ రెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శ - September 27, 2026
- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకై కాంగ్రెస్ ధర్నా - September 27, 2026
- బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి మాజీమంత్రి కేటీఆర్ ఘన నివాళి - September 27, 2026

నాగర్ కర్నూల్: విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, వారి సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ టాస్క్ కార్యాలయంలో మొబైల్ ఫిల్మ్ మేకింగ్ మరియు సినిమాటోగ్రఫీ వర్క్‌షాప్‌ను నిర్వహించామని టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాలలకు చెందిన 56 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ వర్క్‌షాప్‌లో మొబైల్ ఫిల్మ్‌మేకింగ్,ఫోటోగ్రఫీ ప్రాథమిక అంశాలు, కెమెరా టెక్నిక్స్, ఫ్రేమింగ్, లైటింగ్,విజువల్ స్టోరీటెల్లింగ్, ప్రాథమిక సినిమాటోగ్రఫీ తదితర అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుత కాలంలో టెక్నాలజీ యువతకు ఎన్నో కొత్త అవకాశాలను అందిస్తోంది.. ఒకప్పుడు ఫిల్మ్‌మేకింగ్ లేదా మంచి ఫోటోగ్రఫీ చేయాలంటే ఖరీదైన కెమెరాలు, ప్రత్యేకమైన పరికరాలు అవసరమయ్యేవి,కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తోనే మంచి ఆలోచనను, మంచి కథను, మంచి విజువల్‌ను ప్రపంచానికి చూపించే అవకాశం ఉందని తెలిపారు.అనంతరం వర్క్‌షాప్‌ను విజయవంతంగా పూర్తి చేసిన 56 మంది విద్యార్థులకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఫిల్మ్ మేకింగ్ ట్రైనింగ్ సబ్యులు రోషన్ తోపాటు టాస్క్ ప్రతినిధుల బృందం మరియు వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
