పట్టభద్రులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి..జంగిలి యాదగిరి

వెల్దండ:మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హత కలిగిన పట్టభద్రులందరూ బాధ్యతగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని వెల్దండ మండల బీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు జంగిలి యాదగిరి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం వెల్దండ తహసీల్దార్‌ కార్తీక్‌ కుమార్‌కు ఓటు నమోదు దరఖాస్తు ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో విద్యావంతులైన యువత, ఉద్యోగుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల యువ నాయకుడు గోరటి దశరథం పాల్గొన్నారు.1001263331.jpg

You may also like...