పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి సుంకిరెడ్డి రూ.6.80 లక్షల సహకారం

తలకొండపల్లి:రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గౌరిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ నిర్మాణం, అభివృద్ధికి రూ.6.80 లక్షల సహకారం అందించిన రాఘవేందర్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకలని పేర్కొన్నారు. భావితరాలకు సంప్రదాయాలను అందించడంలో ఆలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాల అభివృద్ధికి సహకరించడం ద్వారా సామాజిక ఐక్యతను బలోపేతం చేయవచ్చని తెలిపారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కళ్యాణ్ నాయక్, ఉపసర్పంచ్ రమేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.1001263578.jpg

You may also like...