చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకై కాంగ్రెస్ ధర్నా

1001216296.jpg

నాగర్ కర్నూల్ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని సెప్టెంబర్ 28న సోమవారం ఉదయం 9:00 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించ బడుతుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు.ఈ ధర్నా కార్యక్రమం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు,అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు,పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొంటున్నారని తెలిపారు.కావున అన్ని గ్రామాల నుంచి,పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

You may also like...