కూతురి ప్రాణాల కోసం తల్లిదండ్రుల వేడుకోలు! రూ.25 లక్షలు ఖర్చు చేసినా మెరుగుపడని ఆరోగ్యం

పెద్దకొత్తపల్లి: కన్న కూతురికి వైద్యం చేయించేందుకు ఉన్న అర ఎకరం భూమిని అమ్మి, అప్పులు చేసి ఇప్పటివరకు సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేసినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో నిరుపేద తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన కూలీలు గండు సన్నయ్య, రాములమ్మ దంపతుల 25 ఏళ్ల కుమార్తె చిన్నమ్మ ఆరేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. కిడ్నీలు, కాలేయం, గుండె సంబంధిత సమస్యలతో పాటు మధుమేహంతోనూ బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డయాలసిస్‌తో పాటు ఇతర వైద్య ఖర్చులు భరించలేక ఆర్థికంగా చితికిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ కుమార్తెకు వైద్య సహాయం అందించాలని సన్నయ్య, రాములమ్మ దంపతులు వేడుకుంటున్నారు.

సహాయం చేయదలచిన వారు సంప్రదించాల్సిన వివరాలు:

– తండ్రి: గండు సన్నయ్య

– ఫోన్: 9515893671

– ఫోన్‌పే: 94406820931001262937.jpg

You may also like...