అక్రమాలపై అధికారుల పక్షపాత వైఖరి.. మెకిలలో వ్యక్తమవుతున్న నిరసనలు!
- అక్రమాలపై అధికారుల పక్షపాత వైఖరి.. మెకిలలో వ్యక్తమవుతున్న నిరసనలు! - October 15, 2026
- జ్ఞాన తెలంగాణ’ కథనానికి స్పందన, - September 15, 2026
మెకిలా రెవెన్యూ పరిధిలో అధికారుల తీరుపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లవణి పట్టా భూముల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హడావుడిగా తొలగిస్తున్న సిబ్బంది, నాళా భూములను ఆక్రమించి చేపట్టిన పెద్దల నిర్మాణాల జోలికి మాత్రం వెళ్లడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సామాన్యుల విషయంలో తక్షణమే చర్యలు తీసుకునే యంత్రాంగం, బడాబాబుల విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. వీరికి ఉన్నతాధికారుల నుంచి అండదండలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చట్టం ముందు అందరూ సమానులే అయినప్పుడు.. పేదలకు ఒకలా, ధనవంతులకు మరోలా న్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
