పట్టభద్రుల ఓటు నమోదు పై ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలి: మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

1001313192.jpg

వెల్దండ,అక్టోబర్ 30:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో గ్రామస్థాయి నుంచి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త చురుగ్గా పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు.వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఓటరు నమోదును బాధ్యతగా తీసుకుని అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆయన విమర్శలు చేశారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ చేశారు. ఉద్యోగులకు రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు,పీఎఫ్, డీఏ బకాయిలను చెల్లించాలని కోరారు.పేదల భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై కూడా ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జంగిలి నిరంజన్, కల్వకుర్తి మండల పార్టీ మాజీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బాలయ్య, జంగిలి యాదగిరి, గండికోట రాజు, ప్రభాకర్, ప్రసాద్, ఫరీద్, దేవేందర్, శేఖర్, నందు, ఏంజ, లచ్చిరాం నాయక్, రాజు, శివరాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like...