Category: తెలంగాణ

రాంనగర్ కాలనీ గణనాధుని దర్శించుకున్న జోగయ్య

వెల్దండ: వెల్దండ మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కొలువుదీరిన విఘ్నేశ్వరుని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట స్థానిక యువత, బీఆర్ఎస్ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఉత్సవ కమిటీ సభ్యులు కానుగుల జోగయ్యను శాలువాతో సన్మానించారు.

అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఈ భేటీ జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న 22ఏ అంశంతో పాటు పలు కీలక విషయాలపై ముఖ్యమంత్రి మంత్రులతో సమీక్షించనున్నట్లు సమాచారం. రెవెన్యూ సంబంధిత సమస్యలు, 22ఏ...

ముత్యాలమ్మ ఆలయానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రూ. 25 వేల విరాళం

వెల్దండవెల్దండ మండలం నగరగడ్డ తండా గ్జరామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీ ముత్యాలమ్మ దేవాలయానికి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ రూ.25,000/-ఆర్థిక సహాయం అందజేశారు.ఈ మేరకు ఆలయ నిర్మాణ కమిటీకి సంబంధించిన చెక్కును తండా గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు. గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆలయ నిర్మాణానికి ఈ విరాళం ఎంతగానో దోహదపడుతుందని గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్. లాలు నాయక్, వస్య నాయక్, సబావత్ నాను, చందర్,…

యువత క్రీడల వైపు అడుగులు వేయాలి

బెజ్జూర్: మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై విజయ్‌ను వాలీబాల్ క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై విజయ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామాభివృద్ధితో పాటు క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో వాలీబాల్ క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇంజనీర్స్ డే సందర్భంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

భారతదేశపు మహోన్నత ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే సందర్భంగా పొన్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, ఆయన ఆదర్శాలు, దేశ సేవకు సంబంధించిన అంశాలతో ప్రత్యేకంగా ప్రచురించిన పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు.జనగామలోని సీజేఐటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో పాటు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్వగ్రామమైన ఖిలాషాపూర్‌లోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు విశ్వేశ్వరయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత…

ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో గణనాథునికి ప్రత్యేక పూజలు

కొమురంభీమ్: వినాయక చవితిని పురస్కరించుకుని మంగళవారం ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గణనాథునికి తొలి పూజలు చేసి, జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విగ్రహాల తరలింపు, నిమజ్జనం సమయంలో పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు ఎన్. వామనమూర్తి, అంజన్న, ఆర్ఎస్ఐ…

హయత్‌నగర్‌ సమీపంలో ఘోర ప్రమాదం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూరు రాజీవ్‌ గృహకల్ప వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనను...

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్‌ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. కేంద్ర సాయుధ దళాల కవాతు రిహార్సల్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన, కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో...

తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్-Vతో సీఎం భేటీ

హైదరాబాద్‌:హైదరాబాద్‌లోని తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్‌ రహీమ్‌ అగా ఖాన్-Vతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు మంత్రి అజారుద్దీన్‌, సీఎస్‌ సంజయ్‌ జాజు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు,...

మోకిల లో విద్యుదాఘాతం.. ఎంబీఏ విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్‌ వసతి గృహం వద్ద విద్యుదాఘాతానికి గురై ఎంబీఏ విద్యార్థి ఆర్య మృతిచెందాడు. ప్రమాదంతో వసతి గృహంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విద్యుత్‌ షాక్‌కు గురైన...