రాంనగర్ కాలనీ గణనాధుని దర్శించుకున్న జోగయ్య

1001181563.jpg

వెల్దండ: వెల్దండ మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కొలువుదీరిన విఘ్నేశ్వరుని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట స్థానిక యువత, బీఆర్ఎస్ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఉత్సవ కమిటీ సభ్యులు కానుగుల జోగయ్యను శాలువాతో సన్మానించారు.

You may also like...