యువత క్రీడల వైపు అడుగులు వేయాలి

బెజ్జూర్: మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై విజయ్‌ను వాలీబాల్ క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై విజయ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామాభివృద్ధితో పాటు క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో వాలీబాల్ క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...