హయత్‌నగర్‌ సమీపంలో ఘోర ప్రమాదం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూరు రాజీవ్‌ గృహకల్ప వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

You may also like...