Daily Archive: October 26, 2026

ఘట్‌కేసర్‌ ఫామ్‌హౌస్‌లో బీటెక్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్,మేడ్చల్‌: మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఏదులాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన 21 ఏళ్ల బీటెక్‌ విద్యార్థి కృష్ణ కౌండిన్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉప్పల్‌ భగాయత్‌కు చెందిన రిటైర్డ్‌...

నీళ్ల పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు: అనిల్ కుమార్

దేవరుప్పుల: బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు విమర్శలు మాని అభివృద్ధిపై మాట్లాడాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దావెరా అనిల్ కుమార్ అన్నారు. పాలకుర్తి రిజర్వాయర్ పనులు 70 శాతం పూర్తయ్యాయని, చెన్నూరు రిజర్వాయర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులతో రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

హామీల కోసం ఉద్యమకారుల పోరు.. బాన్సువాడలో అరెస్ట్‌లు

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్న బాన్సువాడ ప్రాంత ఉద్యమకారులను సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 6 గంటలకే తమను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 250 గజాల స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్‌, గుర్తింపు కార్డులు అందించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. అరెస్టులతో…