రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఎలినో ప్రభావంతోనే రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని అదేవిధంగా ప్రతి ఇంట నీటిని వృధా చేయద్దని మరియు ఇంట్లో ఉన్నటువంటి నల్లాలకు ట్యాపులు బిగించాలని సర్పంచ్ ఆకుల హరీష్ యాదవ్ ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి పాలకవర్గం గ్రామ ప్రజలకు సూచించారుపయోగించిన వెంటనే పూర్తిగా మూసివేయాలని కోరారు.
నీటి ప్రతి చుక్క ఎంతో విలువైనదని, ప్రస్తుతం నీటిని పొదుపు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో నీటి ఇబ్బందులను తగ్గించుకోవచ్చని తెలిపారు. గ్రామ ప్రజలందరూ నీటి సంరక్షణలో భాగస్వాములై, మాందాపూర్ గ్రామంలో నీటి వృథాను అరికట్టేందుకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
“నీటిని కాపాడుకుందాం – భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పిద్దాం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ నీటి పొదుపును తమ బాధ్యతగా భావించాలని సర్పంచ్ ఆకుల హరీష్ యాదవ్, ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, గ్రామ పాలకవర్గం కోరారు.
