Daily Archive: October 11, 2026
పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! హైదరాబాద్‌లో పోలీస్ శాఖకు చెందిన అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బాలస్వామిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2017 నుంచి తనతో...
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు గోవాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’లో ఆయన పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా సాయంత్రం జరిగే యాత్రలో పాల్గొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కానున్నారు. గోవాలో పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి...
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు శుభవార్త.. చరిత్రలో నిలిచిపోయే విధంగా రూ.22.84 కోట్లతో 8 విద్యుత్ సబ్‌స్టేషన్లకు మంజూరు.*ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషితో రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు చేసిన నిరంతర కృషి ఫలించింది. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రూ.22.84 కోట్ల అంచనా వ్యయంతో 8 నూతన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు మంజూరు…
కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సంబరాలు గుర్తుండిపోయేలా గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్ మునుపెన్నడూ లేని విధంగా కుంటకట్టపై లైటింగ్ వేసి అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆడపడుచులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా బతుకమ్మ పండుగను జరుపుకునేలా కొత్తదనాన్ని గుర్తుండి పోయేలా చిత్రీకరించారు.
మన్య శ్రీ కాన్సిరాం గారి వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లోనే పండు పంపిణీ చేసిన బీఎస్పీ నాయకులు వారు మాట్లాడుతూభారతదేశంలో వేల సంవత్సరాలుగా కోట్లాది మంది బహుజనులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు) కులం పేరుతో అణచివేతకు, దోపిడీకి గురవుతున్నారు. అటువంటి అణగారిన వర్గాలు తమ ఓటు శక్తితో రాజ్యాధికారమనే మాస్టర్ కీని సాధించి దోపిడీకి గురయ్యే వర్గం నుంచి పాలించే వర్గంగా ఎదగాలనే మహోన్నత లక్ష్యంతో తన పెళ్లి,ఇల్లు,ఆస్తిపాస్తులు వదిలేసి బహుజన సమాజమే నా కుటుంబం అని జీవితాన్ని ధారపోసిన మహోన్నత నాయకుడు మాన్యవర్…
వెంకటాపూర్ అగ్రహారం పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఉపాధ్యాయురాలు పావని ఆధ్వర్యంలో విద్యార్థుల సందడిచట్టం/ ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు పావని ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పావని బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు. గ్రామంలోని మహిళామణులు సైతం వేడుకల్లో పాల్గొనడంతో పాఠశాలలో పండుగ…
బాన్సువాడ: వాసవి హైస్కూల్‌లో బతుకమ్మ, దేవీ నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి బి. లక్ష్మి శ్వేత ఆధ్వర్యంలో విద్యార్థులు బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. నవదుర్గల వేషధారణలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మి శ్వేత మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, దేవీ నవరాత్రులు అమ్మవారి తొమ్మిది రూపాలను ఆరాధించే పవిత్ర పండుగలని తెలిపారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా…
దేవరుప్పుల: జనగామ జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వేడుకలు ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో జనగామ జిల్లా అభివృద్ధి చెందిందని, వైద్య కళాశాల, ఆసుపత్రులు, ఆలయాలు అభివృద్ధి చేశామని తెలిపారు. దేవాదుల నీటితో జిల్లా సస్యశ్యామలమైందన్నారు. ఆదివారం జరిగే వేడుకలకు మూడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో…
భక్తిశ్రద్ధలతో ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 10 : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలను శనివారం మండల ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు పలు రకాల బత్తుకమ్మలను పేర్చి ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి బతుకమ్మ పాటలను పాడి, ఆటలు ఆడారు. అనంతరం ఆయా గ్రామాల చెరువులలో నిమజ్జనం చేశారు. మండల కేంద్రంలో ఉత్తమ బతుకమ్మలను పేర్చిన వారికి లయన్స్ క్లబ్ కట్టంగూర్…
కల్వకుర్తి అక్టోబర్ 10: కల్వకుర్తి మండలం తర్నికల్ తండాలో ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1,100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు, 8 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు.మహబూబ్‌నగర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ దాడులు చేపట్టారు. కల్వకుర్తి ఎక్సైజ్ స్టేషన్,నాగర్‌కర్నూల్ డీటీఎఫ్, మహబూబ్‌నగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్,…