పేదింటి ఆడబిడ్డ వివాహానికి రాధాకృష్ణ ట్రస్ట్ ఆర్థిక సాయం
- మృతుడి కుటుంబానికి అండగా అంజి మాస్టర్.. రూ.3 వేల ఆర్థిక సాయం - October 29, 2026
- పేదింటి ఆడబిడ్డ వివాహానికి రాధాకృష్ణ ట్రస్ట్ ఆర్థిక సాయం - October 29, 2026
- బీజేపీలో చేరిన యువ నాయకుడు శంకర్ నాయక్ - October 29, 2026

కడ్తాల్ అక్టోబర్ 29 : నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. కడ్తాల్ మండలం రేఖ్యతండా గ్రామానికి చెందిన జర్పుల శాంతి, దాస్య దంపతుల కుమార్తె మంజుల వివాహం సందర్భంగా ట్రస్ట్ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ రూ.21 వేల ఆర్థిక సాయంతో పాటు పెళ్లికుమార్తెకు పట్టు చీరను అందజేశారు.ఈ సందర్భంగా దశరథ్ నాయక్ మాట్లాడుతూ నిరుపేదలు, గిరిజన కుటుంబాల అభ్యున్నతికి ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తుందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలిపారు. పేదింటి ఆడబిడ్డ వివాహానికి సహాయం అందించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ గౌడ్, ప్రియా రమేష్ నాయక్, మాజీ ఎంపీటీసీ మంజుల చంద్ర మౌళి, మాజీ సర్పంచ్ హరిచంద్ నాయక్, ఉపసర్పంచ్ దేవు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
