Daily Archive: October 15, 2026

పోలీస్ శాఖపై రిపోర్టర్ అసత్య ప్రచారాలు….

రాజన్న సిరిసిల్ల జిల్లా మంగళవారం రోజున గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రిపోర్ట్ అయిన కేసు విషయంలో పోలీసుల ఇన్విస్టిగేషన్ కు సహకరించకుండా అడిగిన సమాచారం ఇవ్వకుండ గంభీరావుపేట ఎస్సై పైన ఇతర పోలీసుల పైన అసత్య ప్రచారం చేస్తూ వ్యక్తిగతంగా కించపరుస్తూ వరుస కథనాలు రాస్తూ పోలీస్ ఇన్విస్టిగేషన్ ను తప్పుదారి పట్టించేటట్టు చేసిన ఏగ్ధం న్యూస్ పత్రిక ఎడిటర్ మరియు నిర్వహకులైన పోతూరి శేఖర్ తండ్రి స్వామి నూకల మర్రి ప్రస్తుతం కరీంనగర్ మరియు…

జీ తెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గురు వందనం ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్ – 2026..

ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో ఎస్.ఆర్. ఫౌండేషన్ చైర్మన్ శ్రీ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి గారు పాల్గొన్నారు. విద్యారంగానికి, సమాజ సేవకు ఆయన అందిస్తున్న విశేష సేవలు, దాతృత్వం, సేవా కార్యక్రమాల పట్ల ఆయనకున్న నిబద్ధతకు గుర్తింపుగా, విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ తన సొంత నిధులతో బీబీపేటలో ప్రభుత్వ పాఠశాలను నిర్మించి విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు చేసిన కృషికి గాను ఈ కార్యక్రమంలో శ్రీ సుభాష్ రెడ్డి గారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి…

బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్

ఆమనగల్లు అక్టోబర్ 13 :బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రత కల్పించాలని ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పత్యనాయక్ కోరారు. ఈ మేరకు మంగళవారం తుక్కుగూడలో డీసీపీని కలిసి వినతిపత్రం అందజేశారు.ఆమనగల్‌లో నిర్వహించే బతుకమ్మ, దసరా వేడుకలు, జమ్మి పూజ, రావణ దహనం కార్యక్రమాలకు 20 వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో…

డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా

చారకొండ :డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 17న కల్వకుర్తిలో నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేసేందుకు సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఎర్రవల్లి దీక్ష శిబిరాన్ని జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, సభ్యులు రాఘవాచారి, చెన్నకిస్టన్న, తిమ్మప్ప తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యమ కార్యాచరణ, మహా ధర్నా నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

రైతులకు నీరివ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు?

రైతులకు నీరివ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు?కేసీఆర్ హయాంలో తెలంగాణ నంబర్‌ వన్‌.. .కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మూసీ నీటిని వృథాగా వదులుతూ ప్రాజెక్టును ఖాళీ చేసే కుట్ర.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శలుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 13 : కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమ పథకాలను ఒక్కటి కూడా పెండింగ్‌లో పెట్టకుండా అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు….

కిస్మాత్పూర్ డివిజన్ 122 పరిధిలోని కాళికా నగర్ కాలనీలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

122 డివిజన్ ప్రెసిడెంట్ దొంత్రుమోని ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు

వెల్దండ: సర్కూర్ గ్రామం లోని శ్రీశ్రీ శివాలయ ఆంజనేయ స్వామి దేవాలయాల నిర్మాణానికి మండేగుత్తల విజయ్ కుమార్, భద్రప్ప, శివలింగం (దివంగత చెన్న బసప్ప కుమారులు) రూ.1,00,116 విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గోలి గోవర్ధన్ రెడ్డి, గోలి విష్ణువర్ధన్ రెడ్డి, అల్లె సందీప్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాతలకు గ్రామస్థులు, దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరమేశ్వరుని ఆశీస్సులతో దాతలు, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఆలయ నిర్మాణానికి అండగా నిలిచిన శృతి దంపతులు..రూ. లక్ష విరాళం

వెల్దండ:వెల్దండ మండలంలోని చెరుకూరు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీ శివాలయ, ఆంజనేయస్వామి దేవాలయాల నిర్మాణానికి యెడ్ల శృతి (మున్నీ), ఆమె భర్త యెడ్ల ప్రభాకర్ రెడ్డి రూ.50 వేల విరాళాన్ని అందజేశారు.గోలి నర్సింహా రెడ్డి కుమార్తె అయిన శృతి దంపతులు భక్తిశ్రద్ధలతో ఈ విరాళాన్ని సమర్పించారు.ఈ కార్యక్రమంలో గోలి గోవర్ధన్ రెడ్డి, గోలి విష్ణువర్ధన్ రెడ్డి, అల్లె సందీప్ పాల్గొన్నారు. దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు గ్రామస్థులు, దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు….

వెల్దండలో మంత్రి జూపల్లికి ఘన స్వాగతం

వెల్దండ:వెల్దండ మండల పరిధిలోని పీవీఆర్ హోటల్ వద్ద రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఘన స్వాగతం పలికారు.హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తున్న వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామంలోని అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి, గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు.దీనిపై మంత్రి…

టీబీ రహిత గ్రామంగా జూపల్లికి జిల్లా స్థాయి అవార్డు

చారకొండ:జూపల్లి గ్రామం టీబీ (క్షయవ్యాధి) రహిత గ్రామంగా జిల్లా స్థాయిలో అవార్డు అందుకున్న సందర్భంగా సత్య హరిచంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్లె దవాఖానలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో క్షయవ్యాధి నివారణకు కృషి చేసిన మండల వైద్యాధికారి డాక్టర్ సృజన, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌ఓ) బలరాంతో పాటు ఆశా కార్యకర్తలు వలియో బేగం, సన బేగం, రజియా బేగం, భాగ్యమ్మ, దేవులీలను శాలువాలతో సన్మానించారు.అలాగే, రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…