తొంకిని రహదారి అధ్వానం.. బురదలోనే రాకపోకలు

సిర్పూర్‌(టి): మండలం తొంకిని గ్రామ సమీపంలోని ప్రాణహిత నదికి వెళ్లే మార్గం అధ్వానంగా మారింది. వర్షాలతో రహదారి మొత్తం బురదమయంగా మారడంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గం గుండా రైతులు తమ చేనులకు వెళ్తుండగా, నదికి స్నానానికి వచ్చే భక్తులు కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు సైతం రోడ్డుపై నిల్వ ఉండటంతో సమస్య మరింత తీవ్రమైంది. రోడ్డు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, భక్తులు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.