Daily Archive: October 12, 2026

దేవుల నాయక్‌కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పనిత బిల్డర్ అధినేత దేవుల నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు బండమీది వెంకటేష్ ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేవుల నాయక్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను...

హామీలను నెరవేర్చడమే లక్ష్యం : సర్పంచ్ శ్యామల శేఖర్

హామీలను నెరవేర్చడమే లక్ష్యం : సర్పంచ్ శ్యామల శేఖర్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని స్థానిక సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. మంగళవారం కట్టంగూర్‌లోని నాలుగో వార్డులో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నాలుగో వార్డు సభ్యురాలు ఏకుల సుజాత ఎన్నికల్లో గెలిస్తే తన సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మిస్తానని హామీ ఇచ్చారని, అందులో భాగంగా…

పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి : అయిటిపాముల సర్పంచ్ సుధాకర్

పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి : అయిటిపాముల సర్పంచ్ సుధాకర్ జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 6 : గర్భిణులు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని అయిటిపాముల అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, చిరుధా న్యాలు రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో…

రూ 25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్

నాగర్‌కర్నూల్: అచ్చంపేట ఉప విభాగ ఖజానా కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కందాడ వెంకటయ్య రూ.25 వేల లంచం వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడ్డారు. మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. సెలవుల అనంతరం విధుల్లో చేరిన ఫిర్యాదుదారుడికి సెలవులు, రావాల్సిన బత్యాలకు సంబంధించిన బిల్లులు పూర్తి చేసేందుకు సీనియర్ అకౌంటెంట్ వెంకటయ్య రూ.25 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా ఆగస్టు…

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి : తహసిల్దార్ కార్తీక్ కుమార్

వెల్దండ: మండలంలోని డిగ్రీ ఉత్తీర్ణులైన యువతీ యువకులు ఎమ్మెల్సీ ఓటర్లుగా కొత్తగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ కార్తీక్ కుమార్ కోరారు. వెల్దండ మండలంలోని 32 గ్రామపంచాయతీల పరిధిలో ఇప్పటికే 780 మంది పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదై ఉన్నారని తెలిపారు.2023 అక్టోబర్ నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అర్హులైన యువతీ యువకులు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన విద్యార్హత పత్రాలను అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్‌లో లేదా మాన్యువల్‌గా దరఖాస్తు…

ప్రభుత్వ లీడర్ నక్క బొజ్జయ్యకు ఘన సన్మానం

కల్వకుర్తి :హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులైన శ్రీ నక్క బోజ్జయ్య (గణేష్)ను కొమ్మగోని శ్రీనివాస్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఆయన కార్యాలయ ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శాలువా కప్పి సత్కరించడంతో పాటు జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా నక్క బోజ్జయ్యకు లభించిన న్యాయ నియామకం, వృత్తిపరమైన పురోగతిని అభినందించారు. ప్రభుత్వ ప్లీడర్‌గా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల తరఫున సివిల్ వివాదాలు, దావాలు, ఇతర న్యాయపరమైన…

జాషువా మరణం తీరనిలోటు.. నివాళులర్పించిన సర్పంచ్

వెల్దండ:వెల్దండ మండల కేంద్రానికి చెందిన జంగిలి జాషువా మరణించిన విషయం తెలుసుకున్న వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ బుధవారం మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. జాషువా మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొయ్యల పుల్లయ్య, కృపానందం,గుద్దటి కిష్టల్, పసునోజు పురుషోత్తం, మసిగుండ్ల వెంకటేష్,మారేపల్లి శ్రీనివాస్, మట్ట భరత్,రేవల్లి బాలరాజు,ఈదులపల్లి…

చెర్వుఅన్నారంలో పురాతన ఆలయ గోపురం ధ్వంసం! ఇతడి సుదర్శన చక్రం చోరీకి యత్నం

చెర్వుఅన్నారంలో పురాతన ఆలయ గోపురం ధ్వంసం!ఇతడి సుదర్శన చక్రం చోరీకి యత్నంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 9 : మండలం చెర్వుఅన్నారం గ్రామంలోని పురాతన శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి ఆలయ గోపురాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పెకిలించి ధ్వంసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామంలో కలకలం రేపింది. గోపురాని ధ్వంసం చేసిన దుండగులు గోపురం పై బాగా నున్న ఇత్తడి సుదర్శన చక్రాన్ని అక్కడే వదిలేసి వెళ్లారు. ఈ ఘటనను గ్రామస్థులు గురువారం గుర్తించి సుదర్శన…

పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు

పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలుజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 9 : మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కట్టంగూర్ లో జిల్లా పరిషత్ ఉన్నత, కస్తూర్భాగాంధీ, అయిటిపాముల గిరిజన ఆశ్రమ పాఠశాలతో పాటు సాందీపని, ఎస్ఎస్పీఎన్, గీతాంజలి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు బతుకమ్మలను అందంగా పేర్చి పూజలు చేశారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం విద్యార్థులకు ఆయా పాఠశాలల…